ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని, ఏపీ జీఎస్డిపి గ్రోత్ రేట్ 11.4గా ఉందని ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 38 శాతం అధికంగా ఉందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో అతి పెద్ద ఎగుమతిదారుగా ఉందని పేర్కొన్నారు.