టీడీపీ యువనేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. లోకేష్ యువగళం పాదయాత్రపై విరుచుకుపడ్డారు. లోకేష్ తెలుగు వాడుక భాష మాట్లాడలేరని తెలిపారు. ప్రశాంతత బదులు ప్రశాంతత్త అని లోకేష్ అన్నారన్నారు. తెలుగు మాట్లాడలేని వాడు టీడీపీ వారసుడా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ అంటూ సెటైర్లు విసిరారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుందన్నారు. టీడీపీ సీనియర్ నేత అచ్చెంనాయుడు లాంటి వాళ్ళు ఎందుకు లోకేష్ పాదయాత్ర పెట్టామా అని తలలు పట్టుకుంటున్నారని మంత్రి తెలిపారు.