వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఓ యువరైతు పంటల సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా, పోరుమామిళ్ల మండలంలోని గానుగపెంట పంచాయతీ రేపల్లె గ్రామానికి చెందిన చవ్వా వెంకట ప్రతా్‌పరెడ్డి (31) తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేసేవారు. పంటల సాగు కోసం సుమారు ఐదు లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఈక్రమంలో వరిసాగు చేస్తే అకాల వర్షాలు, తెగుళ్లకు పూర్తిగా నష్టపోయాడు. అలాగే ఇటీవల చెరువుల్లో పూర్తిగా నీరు రావడంతో పంట మునకకు గురై నష్టం వచ్చింది. దీంతో పంటలు చేతి కందక.. సాగు కోసం తెచ్చిన తెచ్చిన అప్పులు తీర్చమార్గం లేక మనస్థాపానికి గురై సోమవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద విషద్రావణం తాగాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈమేరకు అతని సోదరుడు సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ తెలిపారు.