నందమూరి తారకరామారావుకు అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్ ను ఆవిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది. పూర్తిగా వెండి తో ఈ నాణెంను తయారు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా మింట్ అధికారులు నమూనాతో దగ్గుబాటి పురందేశ్వరి ని కలిశారు. దీనిపై సలహాలు, సూచనలు పురందేశ్వరి అడిగి తెలుసుకున్నారు.తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పేరుగాంచిన నందమూరి తారకరామారావుకు అరుదైన దక్కింది. కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తున్న నాణేలు పూర్తిగా వెండితో రూపొందించే వంద రూపాయల కాయిన్‌పై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించనున్నారు. దీనికి సంబంధించిన నమూనాను ఎన్టీయార్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరికి నిన్న మింట్ అధికారులు చూపించారు.