ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ అలవాటును మానుకోవడం అంత సులభం కాదు. ఈ అలవాటును మానుకోవాలంటే నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీని ప్రయత్నించండి. సిగరెట్ తాగాలనే కోరికను నిరోధించడానికి చక్కెర లేని గమ్ లేదా ఏదైనా స్వీట్ తినండి. ధూమపానం చేయాలనిపించినప్పుడు మెట్లు ఎక్కుతూ దిగండి. నడక లేదా జాగింగ్ కోసం బయటకు వెళ్లండి. యోగా చేయడం, సంగీతాన్ని వినడం వంటివి ప్రయత్నించండి. ఒత్తిడి కూడా తగ్గుతుంది. ధూమపానం మానేస్తే కలిగే ప్రయోజనాలను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉండాలి.