మొక్కజొన్నలో కెలొరీలు తక్కువగా, పీచు ఎక్కువగా ఉంటాయి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. వీటిని తింటే జీర్ణ సంబంధిత సమస్యలు రావు. స్వీట్ కార్న్‌లో ఉండే ప్రత్యేకమైన బి విటమిన్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని ఫైబర్ లు రక్తంలో చక్కెర స్థాయుల్ని కూడా నియంత్రిస్తాయి. మొక్క జొన్న గింజల్లో మెగ్నీషియం, జింక్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. స్వీట్ కార్న్ లో ఉండే ఫొలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యల్ని రాకుండా చూస్తుంది.