చాలామంది జీర్ణక్రియ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివారు ఆయుర్వేద చిట్కాలతో ఉపశమం పొందవచ్చు. భోజనం చేసినప్పుడు వేడి నీళ్లు తీసుకోవాలి. తినేటప్పుడు వేరే ఏ పనులు పెట్టుకోకూడదు. భోజనం చేయడానికి ముందు తాజాగా ఉన్న చిన్న అల్లం ముక్క, కొంచెం నిమ్మరసం తీసుకోండి. మధ్యాహ్న భోజన సమయంలో ఒక గ్లాసు లస్సీ తాగితే మంచిది. మధ్యాహ్న భోజనాన్ని పుష్టిగా చేయండి. కానీ రాత్రి భోజనం మాత్రం మితంగా తీసుకోండి. రాత్రి 8 గంటల లోపలే డిన్నర్ చేయడం మంచిది.