తిరుపతి అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడపడం, పబ్లిక్ స్థలంలో డబ్బు పెట్టి పేకాట ఆడటం తదితర నేరాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఆ మేరకు పోలీసులు నిందితులను కోర్టులో హాజరు పరిచారు. పలువురికి 52 కేసుల్లో రూ. 44, 480 జరిమానా విధిస్తూ తిరుపతి రెండో ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ శ్రీనివాసులు బుధవారం తీర్పు చెప్పారు.