అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పుష్పగిరి వైద్య నిపుణులు తెలియజేశారు. ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన కంటి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచితంగా శస్త్ర చికిత్సలు, కంటి అద్దాలు, మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.