పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏప్రిల్ 9వ తేదీన జరగనున్న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు సంబంధించిన బ్రోచర్ ను గురువారం పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు మారుతి జిమ్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాల నుండి తొమ్మిది కేటగిరీలో 200 వరకు పోటీదారులు ఈ పోటీల్లో పాల్గొంటారని మారుతి జిమ్ నిర్వాహకులు ఎల్ మోహన్ తెలియజేశారు.
మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా పార్వతీపురం శాసనసభ్యులు అల జంగిజోగారావు పాల్గొననున్నారు. బ్రోచర్ ను విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో 2023 మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహణకు ప్రభుత్వం తరఫున తన తరఫున అందించాల్సిన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని భరోసా కల్పించారు.