మడకశిర పట్టణంలోని కర్ణాటక బ్యాంకులో కొంత మంది ఖాతాదారుల ఖాతా నుంచి వారి ప్రమేయం లేకుండా నగదు మాయమవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల నుంచి ఏడెనిమిది మంది ఖాతాదారులు రూ. 20 వేలు నగదు మాయ మైనట్లు తెలిసింది. గత నెల 22న పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఉమా శంకర్. చిన్నప్ప ఖాతాల నుంచి నగదు డెబిట్ కావడంతో బ్యాంక్ అధి కారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపో వడంతో బుధవారం తెదేపా నాయకులు కర్ణాటక బ్యాంకుకు వెళ్లి మరో మారు వినతి పత్రం అందజేశారు.