గుంతకల్లు పురపాలక సంఘం పరిధిలోని 29 వ సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లాప్ కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ పరిధిల వారీగా చెత్త సేకరణ యూజర్ చార్జీల వసులును పరిశీ లించారు. ప్రతి ఒక్క కార్యదర్శి తమకు కేటాయించిన క్లస్టర్స్ నందు విధిగా చెత్త పన్ను వసూలులో పాల్గొనాలని ఆదేశించారు. అదే విధంగా సచివాలయం సిబ్బంది అందరూ ప్రభుత్వం కేటాయించిన డ్రెస్ కోడ్ ధరించి విధులకు హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం విజిటర్స్ రిజిస్టర్ ను సచివాలయం సిబ్బంది హాజరు పట్టికను పరిశీ లించారు. విధులు, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన సిబ్బందిని హెచ్చరించారు.