బల్లికురవ బస్టాండ్ లో మద్యం అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారంతో అద్దంకి ఎస్ఈబి ఇంచార్జ్ సిఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలిసి బుధవారం దాడులు నిర్వహించారు. కొత్తపాలెం గ్రామానికి చెందిన చల్లగుండ్ల నాగేశ్వరరావు, బ్రహ్మయ్య లిక్కర్ బాటిళ్లు అమ్ముతుండగా 18 బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అద్దంకి కోర్టుకు హాజరపరచగా 14 రోజుల రిమాండ్ కు పంపినట్లు సిఐ తెలిపారు. ఈ సందర్భంగా మద్యం అక్రమ అమ్మకాలు చేపడితే కేసు నమోదు తో జైలు శిక్ష తప్పదని సిఐ శ్రీనివాసరావు హెచ్చరించారు.