శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా, మద్దూరు ఎన్టీఆర్ పుష్కర్ ఘాట్‌లో పటిష్ట ఏర్పాట్లు చేపడతున్నామని కంకిపాడు ఎస్సై జె. లక్ష్మీ అన్నారు. మద్దూరు ఎన్టీఆర్ పుష్కర్‌ఘాట్, కాసరనేనివారిపాలెంలోని నదీ పరివాహక ప్రాంతాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై జె. లక్ష్మీ మాట్లాడుతూ..... శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని పున్యస్నానాన్ని ఆచరిస్తుంటారని తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈవో చింతా కిరణ్ కుమార్, ఫిషరి డెవలప్‌మెంట్ ఆఫీసర్ పూజిత, సర్పంచ్ చిప్పల దాసు, ఎంపీటీసీ వడుగు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa