టైట్ గా ఉండే దుస్తులు ధరించడమంటే సమస్యలు కోరి తెచ్చుకోవడమే అంటున్నారు నిపుణులు. బిగుతైన దుస్తులు బాడీ స్కిన్ పై ఒత్తిడి పెంచుతాయి. బ్లడ్ సర్క్యూట్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నరాలపై ఒత్తిడి పెరిగి సమస్యలు తలెత్తవచ్చు. బిగుతైన జీన్స్, షార్ట్స్ వేసుకునే వారిలో ప్రైవేట్ భాగాలపై కూడా ఒత్తిడి పెరిగి సున్నితమైన సమస్యలు తలెత్తుతాయి. పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది.