ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల, టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు – 2023కు సంబంధించి తొలి రోజున రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం. హరినారాయణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.గురువారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తూ నోటిఫికేషన్ ను జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి విడుదల చేశారు.
భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎం ఎల్ సి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ను నేడు విడుదల చేయడం జరిగిందని, ఫిబ్రవరి 23 వ తేది (గురువారం) వరకు నామినేషన్ ల ప్రక్రియ కొనసాగుతుందని, ఫిబ్రవరి 24న (శుక్రవారం) నామినేషన్ ల స్క్రూటినీ చేయడం జరుగుతుందని తెలిపారు. 27వ తేదిన (సోమవారం) నామినేషన్ ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని తెలిపారు. మార్చి 13న (సోమవారం) ఉదయం 8 గం. ల నుండి సాయంత్రం 4 గం. ల వారు ఎన్నికల పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, మార్చి 16న (గురువారం) కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని, మార్చి 21న (మంగళవారం) ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.
ప్రకాశం – నెల్లూరు - చిత్తూరు నియోజకవర్గ టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా చిత్తూరుకు చెందిన 66 ఏళ్ళ జి. రామమూర్తి, గ్రాడ్యుయేట్ ల ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన 42 సంవత్సరాల కె. శ్రీకాంత్ చౌదరి నామినేషన్లు దాఖలు చేసారని రిటర్నింగ్ అధికారి ప్రకటన లో తెలిపారు.