బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను చేతన్ శర్మ బీసీసీఐ సెక్రటరీ జే షాకు పంపగా ఆయన దానిని ఆమోదించారు. కాగా ఇటీవల ప్రముఖ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ సంచలన విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. టీమిండియా క్రికెటర్లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో చివరకి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని సమాచారం.