మంత్రాలయం: వైఎస్సార్సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి గురువారం ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి శాలువ కప్పి సన్మానించారు. అనంతరం నియోజకవర్గంలో ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణానికై అవసరమైన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, అంతే కాకుండా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరి కొంత మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూమి కొనుగోలు అంశం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పెండింగ్ బిల్లులతోపాటు సమస్యలను సీఎం దృష్టికి వై. ప్రదీప్ తీసుకుని వెళ్లగా సకాలంలో పరిష్కారించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.