తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు ఈనెల 21వ తేదీ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మధురవాడలోని వైజాగ్ కన్వెన్షన్ హాలులో జరగనున్నది. ఈ సదస్సుకు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రాంతీయ సదస్సు ఈనెల 25వ తేదీన జరగాల్సి ఉంది. అయితే రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో మార్పుల నేపథ్యంలో ఈనెల 21న నిర్వహించాలని నిర్ణయించారు. సదస్సుకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, జోనల్ ఇన్చార్జులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్చార్జులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కన్వీనర్లు, రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యులు మొత్తం 2500 మంది వరకూ హాజరవుతారని నాయకులు చెబుతున్నారు.