కర్నూలు జిల్లా, కోడుమూరు మండలంలోని అనుగొండలో రామిరెడ్డి తాత తిరుణాల ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం పాలపండ్ల ఎద్దుల బండ లాగుడు పోటీలను నిర్వహించారు. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి ఎద్దుల జతలు పాల్గొన్నాయి. పోటీలను మాజీ కేంద్ర మంత్రి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా కోట్ల రామిరెడ్డి తాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామప్రజలు, టీడీపీ నేతలు కోట్లకు ఘనస్వాగతం పలికారు. కోట్లను దుశ్శాలువ, పూలమాలలతో సత్కరించారు. కాగా పోటీల్లో ఎస్ కొత్తూరుకు చెందిన బీరం సుబ్రమణ్యేశ్వరరెడ్డి ఎద్దులు తొలి రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి, మొదటి బహుమతి రూ.30 వేలు మాజీ కేంద్రమంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అందించారు. రెండవ బహుమతి రూ.22 వేలు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మూడో బహుమతి రూ.17 వేలు హరికిరణ్, సుబ్రమణ్యం నాలుగో బహుమతి రూ.12 వేలు ఎర్రలింగన్న, ఐదో బహుమతి రూ.9 వేలు చిన్నఅయ్యన్న, ఆరోవ బహుమతి రూ.6 వేలు డ్రైవర్ ఎల్లప్ప ఇచ్చారు.