ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసిపి పాలనతో 25 సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2023, 04:19 PM

వైసిపి పాలనతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వింజమూరు మండలం ఊటుకూరు, తక్కెలపాడు, ఇందిరానగర్ గ్రామాలలోమండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ చంచల బాబు యాదవ్ పాల్గొని స్థానిక టిడిపి నేతలతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వంలో స్థానిక కూలి పనులకు వెళ్లే వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదన్నారు. నారా లోకేష్ చేపడుతున్న యువ గళం పాదయాత్రకి విశేష స్పందన లభిస్తూ ఉండడంతో అది చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్ లోకేష్ పాదయాత్ర పై విమర్శలు చేస్తున్నారన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు పడే ఇబ్బందులను వివరించారు రాష్ట్రం అభివృద్ధి చెందడంలో పూర్తిగా విఫలమైందని కేవలం బటన్లు నొక్కడానికి మాత్రమే పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిని మూలకు వేశారన్నారు ప్రభుత్వం అందిస్తున్నది కేవలం మన దగ్గర వసూలు చేసి మనకే ఇస్తున్నారని ఆ విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలన్నారు అప్పుల ఊబిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రాన్ని కాపాడాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆయనకే ఇది సాధ్యమవుతుందన్నారు వైసీపీ నాయకుడు చెప్పే మాయమాటలు నమ్మక ప్రలోభాలకు లొంగక ఆలోచించి మన కష్టాలు తీర్చే నాయకుని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభివృద్ధి ప్రజల కష్టాలను తెలుసుకొని మనకోసం పాటుపడే ఎమ్మెల్యేగా బొల్లినేని వెంకట రామారావును గెలిపించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దంతలూరు వెంకటేశ్వర్లు , నర్సారెడ్డి, కోడూరు నాగిరెడ్డి, చల్ల శ్రీనివాసులు యాదవ్, నాగభూషణం, రత్నం +ఆరికొండ శ్రీనివాసులు హేంద్రప్రసాద్ గురిజాల వాసు నాయుడు దండు రమణయ్య వై శ్రీనివాసులు నాయుడు ఎరుకల నాయుడు రామ్మోహన్ పెద్దబ్బాయి టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com