ఢిల్లీ అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రాణించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 263 పరుగులకు ఆలౌట్ చేసింది. భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితం అయింది. ఆ జట్టులో ఉస్మాన్ ఖవాజా (81), పీటర్ హ్యాండ్స్ కాంబ్ (72), ప్యాట్ కమిన్స్ (33) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో షమీ 4, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు చొప్పున తీశారు.