ఓ వ్యక్తి ఫేక్ డిగ్రీతో ఏకంగా 30 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో తాజాగా వెలుగుచూసింది. బీఎస్ టోంగర్ అనే వ్యక్తి టెన్త్ చదివి ఫైర్ ఇంజినీర్ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్ సమర్పించాడు. తొలుత క్లర్క్ గా చేరి అనంతరం మధ్యప్రదేశ్ అగ్నిమాపక విభాగంలో గెజిటెడ్ అధికారిగా పని చేశాడు. 2013లో అతను రిటైర్ కాగా దీన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితునికి నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది.