మహాశివరాత్రి నాడు కొందరు రోజంతా ఉపవాసం ఉంటారు. అయితే ఇలా రోజంతా తినకుండా ఉండలేనివారు ఏ సంకోచాలు లేకుండా ఈ పదార్థాలు తినొచ్చట. పనీర్ తో క్యాప్సికమ్ ముక్కలను కలిపి తయారు చేసుకున్న వంటకాలను తినొచ్చు. పుచ్చకాయ లేదా ఇతర పండ్లు తినొచ్చు. రాగి జావ, అంబలి వంటివి తినడం వల్ల నీరసం రాకుండా ఉంటుంది. పాలతో చేసిన సేమియా పాయసం చేసుకుని తింటే కడుపునిండిన అనుభూతి కలిగి ఆకలి అనిపించదు.