ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంలో ఆప్ పార్టీకి భారీ ఊరట లభించింది. నామినేటెడ్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనడానికి వీల్లేదని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నామినేటెడ్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనడంపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేయగా ఇప్పటికే మూడుసార్లు ఎన్నిక వాయిదా పడింది. ఈ క్రమంలో ఆప్ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం, 24 గంటల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ ఇవ్వాలని, ఎన్నిక నిర్వహణ తేదీని కూడా స్పష్టంగా ప్రకటించాలని ఆదేశించింది.