వాతవరణంలో పెద్దగా మార్పులేని ప్రాంతాల్లో ఉల్లి పంట ఎదుగుదల బాగుంటుంది. నీరు నిలవని మెరక నేలలు ఈ పంటకు అనుకూలం. ఎకరాకు 3-4 కిలోల విత్తనం సరిపోతుంది. 2 లేదా 3 సార్లు దుక్కి దున్ని చదును చేసి నారు పోయాలి. నారుపోసుకునే ముందు విత్తనశుద్ది చేసుకోవాలి. కిలో విత్తనాన్ని 3గ్రాముల కాప్టాన్ /థైరంను కలిపి నారు మడిలో విత్తనాన్ని పలుచగా చల్లుకోవాలి. సుమారు 30-45 రోజులు పెరిగిన నారు నాటడానికి అనుకూలంగా ఉంటుంది.