గుజరాత్ వడోదరలోని ప్రసిద్ధ సుర్ సాగర్ సరస్సు మధ్యలో బంగారు పూతతో 111 అడుగుల శివయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంజల్ పూర్ ఎమ్మెల్యే యోగేష్ పటేల్ ఆధ్వర్యంలోని ‘సత్యం శివం సుందరం సమితి’ అనే ట్రస్ట్ రూ.12 కోట్ల విలువైన 17.5 కేజీల బంగారంతో దీన్ని ఏర్పాటు చేసింది. 1996లో విగ్రహం రాగితో ఏర్పాటు చేయగా బంగారు పూత వేయాలని నిర్ణయించి పనులు చేశారు. తాజాగా ఈ విషయాలు ఎమ్మెల్యే వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా సీఎం భూపేంద్ర పటేల్ ఈ విగ్రహాన్ని వడోదరకి అంకింత చేయనున్నారు.