పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) బెయిలౌట్ ప్యాకేజ్ కోసం తాత్కాలిక ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందంపై పాక్ మాజీ ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్ చికిత్సకు డిస్ప్రిన్ ను (ఆస్పిరిన్)(నొప్పి నుంచి ఉపశమనానికి వాడే ట్యాబ్లెట్) వాడతారా? అంటూ మండిపడ్డారు. నానాటికీ పెరుగుతున్న రుణభారం పాక్ ను పెను విపత్తులోకి నెడుతుందన్నారు.