టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైంది. తూర్పుగోదావరి జిల్లా బలబద్రపురంలో చంద్రబాబు రోడ్ షోను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు సభపై ఆంక్షలు విధించిన పోలీసులు.. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డుపై సభకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నామన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని అన్నారు.