తెనాలి: వివాహిత అదృశ్యంపై కేసు నమోదయింది. సుల్తానాబాద్ కు చెందిన 32 ఏళ్ల గృహిణి అంగోతు జయంతిబాయి గురువారం రాత్రి ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. భర్త రామకృష్ణతో మనస్పర్ధల కారణంగా వెళ్లిందని పోలీసుల విచారణలో వెల్లడయింది. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ ఎస్ఐ ఎం. విజయ్ కుమార్ శుక్రవారం తెలిపారు.