జవహర్ను అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లగా.. అక్కడ నేలపై కూర్చుని కనిపించారు. తాజాగా జవహర్ పోలీస్ స్టేషన్‌లో నేలపై కూర్చున్న ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన జరుగుతోంది. మాజీ సీఎం వెంట జవహర్ కూడా ఉన్నారు. చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో జవహర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన సమయంలో ఇదంతా జరిగింది. అయితే పోలీసులు జవహర్‌ను అలా నేలపై కూర్చోబెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది.
పోలీసు అధికారులు భక్తవత్సలం, శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు మాజీ మంత్రి జవహర్. సీఐ తనను కొట్టారని.. తీవ్ర పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఒక గంజాయి స్మగ్లర్, గజ దొంగను చూసినట్టు చూశారని.. తనతో నీచంగా ప్రవర్తించారన్నారు. కేసు నమోదుచేసే వరకూ కదిలేది లేదన్నారు. జవహర్‌తో పాటూ టీడీపీ బీసీ సెల్ నాయకుడు కేతా శ్రీనివాస్ కూడా నేలపై కూర్చున్నారు.
ఆ తర్వాత జవహర్‌ను స్టేషన్ నుంచి వెళ్లిపోవచ్చని ఎస్‌ఐ చెప్పారు. తనను ఎందుకు తీసుకువచ్చారో చెప్పాలని.. కేసు నమోదు చేసే వరకూ కదిలేది లేదన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచనలతో డీఎస్పీ భక్తవత్సలం, సీఐ శ్రీనివాస్‌లపైమాజీ మంత్రి ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు.. తర్వాత స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. ఒకవేళ ఇద్దరిపై కేసు నమోదు చేయకపోతే.. ప్రైవేట్ కేసు వేస్తానన్నారు.