ఎంతమంది కలిసి వచ్చినా నాని, నేను గెలుస్తాం అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టంచేశారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడను ఆయన అన్నారు . చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, ఖర్జూర నాయుడు ఎంతమంది వచ్చినా తనను, కొడాలి నాని వెంట్రుక పీకలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత పట్టాభి కోర్టు పనిపై గన్నవరం వస్తారని.. అప్పుడు చెబుతాను అని వార్నింగ్ ఇచ్చారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు భూమి కదిలిపోయిందని.. ఉడత ఊపులకు తాము భయపడేది లేదన్నారు. తాను, కొడాలి నాని తెలుగుదేశం స్కూల్ లో చదువుకున్నవాళ్ళుమే అన్నారు.
తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌లు అయ్యామన్నారు వంశీ. గన్నవరం, గుడివాడ నియోజవర్గాల్లో చంద్రబాబు, లోకేష్ పోటీ చేయొచ్చు కదా అన్నారు. గన్నవరం వైఎస్సార్‌సీపీ తరఫు నుంచి తాను పోటీ చేస్తానని.. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వైఎస్సార్‌సీపీ పార్టీ పెట్టిన తర్వాత చేరిన వారేనన్నారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఓడిపోయిన తర్వాత ఆఫీసు తీసివేయలేదన్నారు. యార్లగడ్డ వెంకట్రావు లాగా ఇంట్లో దాక్కోలేదని.. యార్లగడ్డ వెంకట్రావుకు రోషం ఉంటే సీఎంతో మాట్లాడుకోవాలన్నారు.
తనకు సంబంధం లేని సంకల్ప సిద్ధిపై తాను లీగల్ నోటీసు ఇచ్చాననన్నారు వంశీ. బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టే నోటీసు ఆపానని.. నోటీసు అందుకున్న పట్టాభి రిప్లై ఇవ్వలేదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను తానెవరిని తిట్టలేదని..హోటల్ పార్క్ ఎలైట్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులతో భేటీ అయ్యానన్నారు. యార్లగడ్డ వైపు ఉండండి లేకపోతే తన వైపు ఉండండి అని అడిగానని.. వ్యక్తిగతంగా గ్రూప్ పెట్టి కొడాలి నాని, తనను విమర్శిస్తున్నరని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేసినా చెయ్యక పోయినా.. తాను గన్నవరం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసేది తానేని కుండబద్దలు కొట్టేశారు. కచ్చితంగా తానే గెలుస్తానని.. ఏ వర్గం అయినా కొంతమందికి తాను పదవులిచ్చాను అన్నారు. వాళ్ళు అది కాపాడుకుంటే మంచిదని.. ఎన్నికల్లో ఓడిపోగానే తాను తట్టాబుట్టా సర్దుకుని పోలేదన్నారు.
2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి సీన్ రిపీట్ అవుతుందన్నారు వంశీ. వైఎస్సార్సీపీకి సీట్లు ఇంకా పెరుగుతాయని జోస్యం చెప్పారు. చంద్రబాబు కుప్పంలో సొంతంగా ఇళ్లు కట్టుకున్నా ఉపయోగం లేదని.. నారా లోకేష్ గురించి మాట్లాడుకోవడం దండగన్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా, తాను మంత్రిగా పని చేసినా 2019 ఎన్నికల్లో గెలవలేకపోయాడని ఎద్దేశా చేశారు. దీన్ని బట్టి లోకేష్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. తమ నియోజకవర్గాలను తాము కాపాడుకుని.. మిగిలిన వాళ్ల గురించి మాట్లాడాలని ఎద్దేవా చేశారు. 2024లో వైఎస్ జగన్మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa