కుసుమ నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కుసుమ నూనెలో మెగ్నీషియం, భాస్వరం, మాంగనీస్, జింక్, ఇనుము, రాగి, ప్రొటీన్ ఖనిజాలు ఉంటాయి. కుసుమ నూనె మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మం, జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ నూనెతో చేసిన వంటలను తినాలి. ఈ నూనె వాడటం వల్ల రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది.