తాటిబెల్లంలో అవసరమైన ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. తాటిబెల్లం పేగులను శుభ్రపరుస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఆస్తమాను తగ్గిస్తుంది. దీనిలో ఉండే కాల్షియం, పోటాషియం, భాస్వరం ఎముకలకు బలాన్నిస్తాయి. తాటిబెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తాయి. తాటిబెల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వేడిని తొలగిస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యను పోగొడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపిస్తుంది.