ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. సోమవారం రోజు రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాల తర్వాత 48 గంటల్లోనే తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ప్రకటించింది. తమ ఫైరింగ్ రేంజ్ ను పసిఫిక్ కు మారుస్తామని కిమ్ హెచ్చరించారు. ఈ ప్రయోగాలను జపాన్ ప్రధాని కార్యాలయం కూడా నిర్ధారించింది.