నందవరం మండలంలోని గురుజాల రామలింగేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు, ఈవో దీనేష్, ఆర్చకులు హంపిస్వామి, వేదపండితులు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, రాజారెడ్డి, జాన్, ఈరన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని ఆలయ సంప్రాదాయాల ప్రకారం ఆహ్వానం పలికి సన్మానించారు. ఆనంతరం హోమం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐ మహేష్‌కు మార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.