ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దుంపతులు చేరుకున్నారు. సున్నిపెంటలోని హెలిఫ్యాడ్ వద్ద వారికి జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతిలు పుష్పగుచ్చం అందజేసి ఆహ్వానం పలికారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వారిని ప్రత్యేక వాహనాల్లో శ్రీశైలానికి తీసుకెళ్లారు.