మల్లాపూర్ మండల కేంద్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ కనక సోమేశ్వర కొండ కింద కన్నుల పండుగగా అశేష జన వాహిని మధ్య ఆదివారం రాత్రి 12 గంటలకు రథోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని రకాల సకల వసతులు కల్పించారు మల్లాపూర్ ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.