పిల్లల్లో, మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలామందిలో ఐరన్ లోపంతోనే రక్తహీనత తలెత్తుతుంటుంది. దీనికి ఎండుద్రాక్ష బాగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. రాత్రిపూట 10-15 ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున వీటిని తిని నీళ్లు తాగటం మంచిది. ఇది ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తహీనతా తగ్గుతుంది.