యాపిల్ ఐ ఫోన్ కి ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అయితే ఈ క్రేజే ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. కర్ణాటక హాసన్ జిల్లా లక్ష్మీపురంలో ఉండే హేమంత్ ఆన్ లైన్ ఐఫోన్ బుక్ చేశాడు. మొబైల్ డెలివరీ చేసేందుకు నాయక్ అనే యువకుడు రాగా, డబ్బు చెల్లించడంపై వారిద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో నాయక్ ను హేమంత్ కత్తితో పొడిచి చంపేశాడు. రెండు రోజుల తర్వాత మృత దేహాన్ని గోనె సంచిలో పెట్టి రైల్వే ట్రాక్ పై పడేశాడు.