శాంతిపురం మండల కేంద్రంలో సోమవారం వైయస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ వాహనాన్ని ఎంపిపి వసుంధర కోదండరెడ్డి, జడ్పిటిసీ శ్రీనివాసులు ప్రారంభించారు. మండల పరిదిలో పశువులకు అత్యవసరంగా అనారోగ్యం వచ్చినప్పుడు 1962 నెంబరుకు ఫోన్ చేస్తే ఈ వాహనం ద్వారా గ్రామలకు వచ్చి పశువులకు అత్యవసర చికిత్స అందించడం జరుగుతుందని వారు అన్నారు. వాహన ప్రారంభొత్సవంలో సర్పంచ్, ఎంపిటిసీ, వైసిపి నాయకులు, కార్యలర్తలు పాల్గొన్నారు.