రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ కలసి కట్టుగా పని చేద్దాం అని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు పెనుకొండ మండలంలోని సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో శిక్షణ కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్బంగా నాగలూరు, మావటూరు, గోనిపెంట, రాంపురం, సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల కు ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ మండల సచివాలయ కన్వీనర్, ఎంపీపీ, జెడ్పిటిసి, ఎంపీటీసీలు, మండల కన్వీనర్, సర్పంచులు, వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.