కంబదూరు మండల కేంద్రంలోని మండల పరిషత్తు సమావేశపు భవనం లో మిషన్ అంత్యోదయ 2022--2023వ సంవత్సరంలో మిషన్ కార్యక్రమం పై సమీక్ష సమావేశాన్ని సోమవారం ఎంపిడిఓ ఆంజినేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ జనభా ఎంత, గ్రామ జనభా తగ్గటుగా మౌళిక సదుపాయాల కల్పన కోసం తీసుకోవాల్సిన ప్రణాళిక విధి విధానాలపై గ్రామ స్థాయిలో చేపట్టిన సర్వే వివరాలను ఆయన పంచాయతీ వారీగా ఆయా కార్యదర్శులను ఆయన అడిగి తెలుసుకున్నారు. మిషన్ అంత్యోదయ కింద సర్వే చేపట్టిన ఆధారంగా గ్రామాలలో మౌళిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని, కావున గ్రామ స్థాయిలో పారదర్శకంగా సర్వే చేపట్టాలని ఆయన పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు మహేష్, వీరశేఖర్ లతో పాటు గ్రామ సచివాలయ కార్యదర్శులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.