శ్రీశైల బ్రహ్మోత్సవాలకు వెళ్లి, వచ్చే లక్షలాది మంది భక్తులకు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాలు ఆదివారం వరకు కొనసాగాయి. శ్రీశైలం రహదారిలో రెడ్ల సంఘం, అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షుడు కనకయ్య ఆధ్వర్యంలో తానం చింతల ప్రజలు, ఇస్కాన్ సంస్థ, బలిజ సంఘం మూడు రోజుల పాటు అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశాయి. శ్రీశైలం నుంచి తిరుగు ముఖం పట్టిన భక్తులతో ఆయా శిబిరాలు నిండిపోయాయి. పంచాయతీ అధికారులు తాత్కాలిక చలివేంద్రాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశారు. పంచాయతీ సిబ్బంది రహదారుల వెంట చెత్తాచెదారం తొలగించడం, దుమ్ము లేయకుండా రహదారిని నీటితో తపడం, బ్లీచింగ్, సున్నం చల్లి అపరిశుభ్రత లేకుండా చేశారు.