చిన గంజాం తిరునాళ్ల ప్రశాంతంగా ముగిసేలా గట్టి చర్యలు తీసుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ జిందాల్ అభినందించారు. దాదాపు లక్ష మంది భక్తులు హాజరైనప్పటికీ ఒక చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీసులు శ్రమించారు. ఇంకొల్లు సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆరుగురు ఎస్సైలు కంటి రెప్ప కూడా మూయకుండా చినగంజాంలో విధులు నిర్వహించారు. అంతేగాక భక్తుల సౌకర్యార్థం అక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నం కాకుండా చూశారు. అసాంఘిక శక్తులపై డేగ కన్ను వేశారు. కాగా చినగంజాంలో అంకిత భావంతో పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించారని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే విధమైన అప్రమత్తతను భవిష్యత్తులో కూడా పాటించాలని ఎస్పీ వారికి సూచించారు.