ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు ఆయుధాలు ఇచ్చే యోచన చేస్తోందంటూ చైనాపై ఆరోపణలు చేశారు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్. దీంతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ శాంతి నామం జపిస్తూ యుద్ధ భూమికి ఆయుధాలను పంపిస్తోంది అమెరికానే గానీ చైనా కాదంటూ విరుచుకుపడ్డారు. అలాగే రష్యా-చైనా సంబంధాల విషయంలో అమెరికా వేలు పెట్టేందుకు యత్నించవద్దని, దీన్ని తాము అంగీకరించమని వార్నింగ్ ఇచ్చారు.