దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఓ దళిత కుటుంబం వివాహ వేడుక జరుగుతుండగా, అక్కడికి వచ్చిన కొందరు దుండగులు వారిపై దాడి చేశారు. కులాన్ని దూషిస్తూ, తుపాకీ తలపై ఎక్కుపెట్టి చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బాగేశ్వర్ ధామ్ ప్రాంతంలో జరిగింది.