ఇంటి నిర్మాణం ఈ రోజుల్లో చాలా సాహసోపేత చర్య. అలాంటి కలను తక్కవ వడ్డీతో సాకారం చేసేందుకు కొన్ని బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఇదిలావుంటే ఫిబ్రవరి 8న భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు రెపో రేటు అనుసంధానమైన లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో హోం, పర్సనల్, వెహికిల్ లోన్లు ఇలా అన్నీ మరింత భారమయ్యాయి. హోం లోన్ పొందిన వారు కూడా ఈఎంఐ ఎక్కువ నెలలు కట్టాల్సి వస్తుంది. మరోవైపు.. కొత్తగా లోన్ పొందాలనుకుంటే అధిక ఈఎంఐ చెల్లించాల్సి వస్తోంది. అయితే చాలా వరకు దిగ్గజ బ్యాంకులతో పోలిస్తే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తక్కువ వడ్డీకి హోం లోన్లు ఇస్తున్నాయి. ఫైనాన్స్ కంపెనీలు సహా ఏ బ్యాంకుల్లో హోం లోన్ వడ్డీ ఎంత శాతం ఉంది? ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుంది? ఇప్పుడు చూద్దాం.
జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై అత్యంత తక్కువ వడ్డీ వసూలు చేస్తోంది. ఇక్కడ 8.10 శాతం మాత్రమే ఉండటం విశేషం. ఇక రూ.75 లక్షల హోం లోన్ తీసుకుంటే గనుక 20 ఏళ్ల కాలవ్యవధికి ఈఎంఐరూ.63,201 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ వడ్డీలు వసూలు చేసే టాప్-3 లెండర్స్లో అన్నీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలే ఉండటం విశేషం. భారతదేశపు అతిపెద్ద మార్ట్గేజ్ లెండర్ హెచ్డీఎఫ్సీ.. 8.45 శాతం వడ్డీ రేటుకు హోం లోన్ ఆఫర్ చేస్తోంది. ఇక ఇక్కడ రూ.75 లక్షల గృహ రుణం తీసుకుంటే 20 సంవత్సరాల కాలవ్యవధికి రూ.64,850 చొప్పున ఈఎంఐ కట్టాలి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్.. 8.50 శాతం వడ్డీతో హోం లోన్ సదుపాయం కల్పిస్తుంది. ఇందులో EMI రూ.65,087 చొప్పున చెల్లించాలి.