450 ప్లస్, 450X ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే ఏథర్ ఎనర్జీ కంపెనీ భారత్ లోని 80 నగరాల్లో 1,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, ఏథర్ గ్రిడ్ లను ఏర్పాటు చేసింది. 2023 చివరి నాటికి 2,500 కంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్‌లను ఇన్‌స్టాల్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఏథర్ గ్రిడ్ దేశంలోని ఈవీ స్కూటర్ల కోసం అతిపెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ గా పేరు గాంచింది. ఈ కంపెనీ ఏర్పాటు చేసిన ఛార్జింగ్ స్టేషన్లలో 60% టైర్-II, టైర్-III నగరాల్లో ఉన్నాయి.