కార్పొరేట్ కంపెనీలు,ట్రేడర్ల చేతుల్లో చిక్కి పౌల్ట్రీ రైతులు నష్టాల పాలవుతున్నారు. బ్రాయిలర్ కోళ్లు, గుడ్లు ధరలను కార్పొరేట్ సంస్థలు, ట్రేడర్లే నిర్ణయిస్తున్నారు. దీంతో రైతులు గిట్టుబాటు ధర రాక లబోదిబో మంటున్నారు. గతంలో రూ.120-130 ఉన్న కిలో కోడి ధర ప్రస్తుతం రూ.80లే ఉంది. మరోవైపు గుడ్డు ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తుంది. ఫలితంగా లాభాల మాట అలా ఉంచింతే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు.